: తెలంగాణ హోం మంత్రి నాయినిపై పెద్దరెడ్డిదే పైచేయి!
కొత్త రాష్ట్రం తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో విజయం సాధించి తొలి సర్కారును ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు మూడు నెలల్లోనే టీడీపీ ఝలక్ ఇచ్చింది. ఇటీవల పలు పరిశ్రమల్లో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు నెగ్గుతూ వస్తున్నప్పటికీ, ఆదివారం సూపర్ మ్యాక్స్ పర్సనల్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిపై తెలుగు దేశం పార్టీ కార్మిక విభాగం తరఫున పోటీ చేసిన పెద్దిరెడ్డి విజయం సాధించారు. నాయినిపై 40 ఓట్ల తేడాతో పెద్దిరెడ్డి గెలిచారు.