: డబ్బు తీయడం కుదర్లేదని ఏటీఎం లేపేశారు
ఉత్తరాదిలో ఏటీఎం దొంగలు ఎక్కువైపోతున్నారు. ప్రధానంగా పంజాబ్ లో ఏటీఎం దొంగలు విజృంభిస్తున్నారు. పంజాబ్ లోని మెగా జిల్లాలోని కోటిసేఖన్ లో ఉన్న ఏటీఎం నుంచి డబ్బు దొంగిలించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఏటీఎం మెషీన్ ఎంతకీ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎంను ఎత్తుకుపోయారు. ఏటీఎం మెషీన్ పోయిందని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఏటీఎంను గాలించే పనిలో పడ్డారు.