: చిరంజీవి గారూ, ఇదేమైనా సినిమానా? : కృష్ణంరాజు


వంద రోజుల పాలనలో చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాదుకు విమాన ప్రయాణాలే తప్ప ఇంకా సాధించిందేమీ లేదని కాంగ్రెస్ నేత చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కృష్ణంరాజు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన మాట్లాడుతూ, 100 రోజుల పాలనలో దేశంలో పరిస్థితులు మారిపోవడానికి ఇదేమైనా సినిమానా? అని ప్రశ్నించారు. డిపాజిట్లు కూడా దక్కని కాంగ్రెస్ నేతలు, బీజేపీ, టీడీపీలను విమర్శించడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News