: బతుకమ్మ ఆడుతూ, చెరువును రక్షించాలన్న వీహెచ్
కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) ఏం చేసినా వినూత్నంగా ఉండాలని కోరుకుంటారు. అందుకే ఆయన చేసే విమర్శలు కూడా అందరికీ భిన్నంగా ఉంటాయి. హైదరాబాదులోని బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ ఆయన బతుకమ్మ ఆడారు. సుమారు 600 మంది మహిళలతో బతుకమ్మ పండుగ నిర్వహించిన వీహెచ్ మాట్లాడుతూ, కొన్ని దశాబ్దాలుగా అంబర్ పేట వాసులు బతుకమ్మ ఆటలు ఆడి కుంటలో నిమజ్జనం చేసేవారని, అందుకే దీనికి బతుకమ్మ కుంటగా పేరు వచ్చిందని అన్నారు. ఇప్పుడీ కుంట కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతోందని, తక్షణమే ప్రభుత్వం దీనిని పరిరక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.