: కాశ్మీర్ పై బిలావల్ వి పగటి కలలు: ముస్లింలీగ్
కాశ్మీర్ పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను ఇండియన్ ముస్లిం లీగ్ ఖండించింది. ఆ పార్టీ ఎంపీ అహ్మద్ మాట్లాడుతూ, కాశ్మీర్ పై బిలావల్ పగటి కలలు కంటున్నారని అన్నారు. భారతీయ ముస్లింలు తమ దేశాన్ని రక్షించుకోవడంలో ఎప్పుడూ ముందు నిలుస్తారని ఆయన తెలిపారు. అలాంటి వ్యాఖ్యలు వారి అభద్రతా భావాన్ని బయటపెడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పాక్ లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని అన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు.