: గురజాడ ఇంటిని స్మారక చిహ్నంగా రూపొందిస్తాం: మృణాళిని


మహాకవి గురజాడ అప్పారావు నివాస గృహాన్ని స్మారక చిహ్నంగా రూపొందించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి మృణాళిని తెలిపారు. విజయనగరంలో గురజాడ జయంతి ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గురజాడ రచనలు సామాజిక చైతన్యానికి ప్రతీకలని అన్నారు. ఆయన రచనల్లోని పాత్రలు అప్పటి సామాజిక, ఆర్ధిక, రాజకీయ ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు చూపుతాయని ఆమె తెలిపారు. గురజాడ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News