: విజయవాడలో రేసింగ్ సంస్కృతి...రేసింగ్ లో ఎమ్మెల్యే కుమారుడు


బైక్ రేసింగ్ సంస్కృతి విజయవాడకు విస్తరించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద విజయవాడకు చెందిన కొందరు యువకులు ఖరీదైన బైకులతో రేసింగ్ నిర్వహించారు. ఆ బైకులపై యువకులు వేగంగా దూసుకుపోవడంతో భయబ్రాంతులైన స్థానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో యువకులకు, స్థానికులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిపై బైండోవర్ కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని హెచ్చరించి వదిలేశారు. యువకుల్లో ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండడం విశేషం.

  • Loading...

More Telugu News