: శివసేన, బీజేపీ మధ్య సీట్ల తకరారు


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలైన శివసేన, బీజేపీ మధ్య సీట్ల తకరారు తారస్థాయికి చేరుకుంది. 151 స్థానాల్లో శివసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కుండబద్దలు కొట్టారు. బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపిన ఆయన, కూటమిలోని ఇతరులు 18 స్థానాల్లో పోటీ చేస్తారని అన్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ శివసేన చేసిన ప్రతిపాదన కొత్త అంశం కాదని పేర్కొంది. సీట్ల సర్దుబాటు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బీజేపీ సూచించింది. మీడియా ద్వారా సీట్ల సర్దుబాటు జరగదని ఆ పార్టీ స్పష్టం చేసింది. శివసేనతో తమ మైత్రి పటిష్ఠమైనదని బీజేపీ తెలిపింది.

  • Loading...

More Telugu News