: ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు: పల్లె
రానున్న ఐదేళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కనీవినీ ఎరుగని రీతిలో ఐటీ విధానం అమలు చేస్తామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఈ కేబినెట్ నిర్వహించామని తెలిపిన ఆయన, రాష్ట్రాభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్లతో ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. ఏపీని మోడల్ స్టేట్ గా తయారు చేస్తామని ఆయన వెల్లడించారు.