: ఆరోపణలు రుజువుచేయలేకపోతే రేవంత్ గుండు గీయించుకుంటారా?: టీఆర్ఎస్


మెట్రో ప్రాజెక్టుపై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని టీఆర్ఎస్ నేతలు అన్నారు. ఆరోపణలు రుజువు చేయలేకపోతే రేవంత్ గుండు గీయించుకుంటారా? అని వారు సవాల్ విసిరారు. మెట్రో విషయంలో రేవంత్ చెబుతున్న విషయాలు నిజమని తేలితే తాము దేనికైనా సిద్ధమని వారు అన్నారు. చంద్రబాబు చేతిలో రేవంత్ రెడ్డి కీలుబొమ్మ అని విమర్శించారు. బాబు... రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకుని మెట్రో ప్రాజెక్టును అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని వారు మండిపడ్డారు. రేవంత్ మీడియా ఎదుటకు వస్తే చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ నేతలు అన్నారు.

  • Loading...

More Telugu News