: డ్రైవర్ల హత్యకేసు నిందితుల అరెస్టు
జాతీయ రహదారిపై లారీ డ్రైవర్ల మృతదేహాలు లభ్యం కావడం సంచలనం కలిగించడం తెలిసిందే. ఈ హత్యలకు పాల్పడిన కిరాతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... కొన్ని రోజుల క్రితం కాపర్ లోడుతో లారీలు చెన్నై నుంచి బయలుదేరాయి. అయితే, అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ఆ లారీల డ్రైవర్లను హత్య చేసి, లారీలను ఎత్తుకెళ్ళారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఇంతలో, లారీ డ్రైవర్ల మృతదేహాలను నెల్లూరు జిల్లా గూడూరు వద్ద ఓ వాగులో పడి ఉండగా కనుగొన్నారు. ఇక ఆ లారీల విషయమై జీపీఆర్ఎస్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన పోలీసులు... ఆ లారీలు నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద మణికంఠ దాబా వద్ద నిలిపి ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వెళ్ళి నిందితులను అరెస్టు చేసి, లారీలను స్వాధీనం చేసుకున్నారు.