: తెలంగాణ వచ్చిందని ఆనందించాం... కలలు భగ్నమయ్యాయి: టి సర్కారుపై ప్రజాసంఘాల మండిపాటు


తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఎంతో ఆనందించామని, ఇప్పుడు, రాష్ట్ర సర్కారు వైఖరితో కలలు భగ్నమయ్యాయని ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాదులో నిర్వహించతలపెట్టిన సదస్సుకు పోలీసులు అనుమతించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ ను కలిసేందుకు కూడా అపాయింట్ మెంట్ లభించలేదని హరగోపాల్, పొత్తూరి, చుక్కా రామయ్య అన్నారు. మరో నేత ఎన్.వేణుగోపాల్ మాట్లాడుతూ, గత 40 ఏళ్ళలో ఇంతటి నిర్బంధాన్ని ఎప్పుడూ చూడలేదని, సభ పెట్టుకోవడానికి హోం మంత్రి అనుమతి ఇచ్చినా, పోలీసులు నిరాకరిస్తున్నారని చెప్పారు. సదస్సు నేపథ్యంలో వరవరరావు, కల్యాణ్ రావు, జితేన్ మరాండీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.

  • Loading...

More Telugu News