: శనగ రైతుల ఆందోళనపై స్పందించిన మంత్రి ప్రత్తిపాటి
ఈ ఉదయం ప్రకాశం జిల్లా రైతులు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించడం తెలిసిందే. శనగకు మద్దతు ధర ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి పుల్లారావు స్పందించారు. ప్రకాశం జిల్లాలో గిడ్డంగుల్లో ఉన్న శనగ నిల్వల వేలం 15 రోజులపాటు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.ఈలోగా ప్రభుత్వమే కొనుగోలు చర్యలు తీసుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు.