: ఫ్రీ ఇంటర్నెట్ తో రూ.2000కే స్మార్ట్ ఫోన్
దేశీయంగా చవకధరల్లో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ల తయారీలో పేరెన్నికగన్న డేటావిండ్ మరో బంపర్ ప్రొడక్ట్ ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. జీవితకాలపు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యంతో కేవలం రూ.2000 కే స్మార్ట్ ఫోన్ ను అందిస్తోంది. ఈ దీపావళికి ఈ సరికొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. 3.5 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది.