: సదస్సుకు వచ్చేవారిని అరెస్టు చేస్తాం: డీసీపీ కమలాసన్ రెడ్డి
ఓ వైపు ప్రజాసంఘాలు హైదరాబాదులో రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సదస్సు నిర్వహించేందుకు దృఢనిశ్చయంతో ఉండగా, పోలీసులు కూడా పరిస్థితిని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సమావేశానికి వచ్చేవారిని అరెస్టు చేస్తామని డీసీపీ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. అటు, విరసం నేతలు, కార్యకర్తల అరెస్టును ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.