: వారం పాటు 28 రైళ్ల రద్దు


బీహార్, జార్ఖండ్‌ లలో వారం రోజుల పాటు పలు రైళ్లు నిలిచిపోనున్నాయి. ఈ నెల 21-30 మధ్య మావోయిస్టు పార్టీ వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లోని ఐదు డివిజన్ల పరిధిలో 28 పాసింజర్ రైళ్లను తూర్పు మధ్య రైల్వే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. గత అనుభవాల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను మాత్రమే ఆర్పీఎఫ్ భద్రత మధ్య నడపాలని నిర్ణయించింది. దీంతో ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ మార్గంలోని పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

  • Loading...

More Telugu News