: 700 ఏళ్లుగా వాళ్లు చేతులు విడువలేదు!


కష్టనష్టాలు ఎన్ని వచ్చినా చేతిని విడిచేది లేదంటూ ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారేమో, గత 700 ఏళ్లుగా ఆ జంట చేతులు విడువకుండా పట్టుకునే ఉన్నారు. లీస్టర్ షైర్ ప్రాంతంలో ఓ చర్చిని వెతికేందుకు పురావస్తు శాస్త్రజ్ఞులు వెతుకుతుండగా, చేతులు పట్టుకుని ఉన్న ఓ జంట అస్థిపంజరాలు బయటపడ్డాయి. ఇవి దాదాపు 700 ఏళ్ల క్రితం నాటివని శాస్త్రవేత్తలు నిర్థారించారు. గతంలో ఇలా జంట అస్థిపంజరాలు బయటపడ్డప్పటికీ, చేతులు పట్టుకుని లేవని వారు వెల్లడించారు. రేడియోకార్బన్ డేటింగ్ ద్వారా ఇక్కడ చూసినప్పుడు మొత్తం 11 అస్థిపంజరాలు దొరకగా, వాటిలో ఈ జంట అస్థిపంజరాలున్నాయి. ఈ అస్థిపంజరాల్లో కొన్ని 14వ శతాబ్దం నాటివి కూడా ఉన్నాయని వారు వివరించారు.

  • Loading...

More Telugu News