: లారీ డ్రైవర్లను హత్య చేసి, లారీని ఎత్తుకెళ్లిపోయారు
చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు లారీ డ్రైవర్లను హత్య చేసిన దుండగులు, లారీని ఎత్తుకెళ్లిపోయారు. తమిళనాడుకు చెందిన ఈ వాహనంపై సమాచారం లేకపోవడంతో చెన్నైలోని లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తమిళనాడు పోలీసులు నెల్లూరు జిల్లా పోలీసుల సహకారం అభ్యర్థించారు. పోలీసులు జీపీఎస్ ద్వారా లారీ నెల్లూరు జిల్లా దగదర్తిలో ఉన్నట్టు గుర్తించారు. దీంతో నెల్లూరు జిల్లా, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద లారీని పట్టుకున్నారు. ఇద్దరు డ్రైవర్లను హత్య చేసిన దుండగులను అదుపులోకి తీసుకున్నారు.