: కత్తిపోటుకు దారితీసిన వాగ్వాదం
తిరుమలలోని ఓ హోటల్ లో ఇద్దరు కార్మికుల మధ్య వాగ్వాదం కత్తిపోటుకు దారితీసింది. ఓ హోటల్ లో పనిచేస్తున్న మహేష్, రాజాల మధ్య వాగ్వాదం నెలకొంది. అది తారస్థాయికి చేరడంతో వారిద్దరూ ఘర్షణకు దిగారు. దీంతో మహేష్ పై రాజా కత్తితో దాడి చేశాడు. దీంతో మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు మహేష్ ను రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తున్న వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.