: ఒకర్ని కట్టేసి, మరొకర్ని కత్తితో పొడిచి...ఇల్లు దోచుకుంటూ అత్యాచారం


రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. జైపూర్ లోని విలాసవంతమైన వైశాలి నగర్ ప్రాంతంలో ఒళ్లు గగుర్పొడిచే దోపిడీ జరిగింది. వంటగది కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అక్కడున్న పెద్దమనిషిని తాడుతో కట్టేశారు. పిల్లలను కత్తితో బెదిరించి గదిలో పెట్టేశారు. తరువాత ఆ పెద్దమనిషి కుమారుడ్ని కత్తితో 9 సార్లు వీపు, పొట్ట భాగాల్లో పొడిచారు. దీంతో అతను స్పృహ తప్పిపోయాడు. ఆ తరువాత అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి తెగబడ్డారు. 10 వేల రూపాయల నగదు, 150 గ్రాముల బంగారం దోచుకున్న దొంగలు, అల్మారాలను చిందరవందర చేసి వెళ్లిపోయారు. అనంతరం బాధితుడ్ని ఆసుపత్రిలో చేర్పించగా, అతడికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News