: ఆరునెలల తరువాత జగన్ పార్టీ ఉండదు: జేసీ
మరో ఆరు నెలల తరువాత వైఎస్సార్సీపీ ఉండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లాభపడేది రాయలసీమేనని అన్నారు. మాగంటి బాబుపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. కుక్కనూరులో కలెక్టర్ పర్యటనను వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. ముంపు మండలాల విషయంలో టీఆర్ఎస్సే మాట్లాడడం లేదని, అలాంటప్పుడు వైఎస్సార్సీపీకి ఎందుకని ఆయన నిలదీశారు. మరో ఆరు నెలల్లో జగన్ ఏకాకి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.