: కాశ్మీర్ పాకిస్థాన్ లోనిది... ప్రతి అంగుళాన్ని తిరిగి తీసుకుంటాం: భుట్టో వారసుడు
పాకిస్ధాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిల్వాల్ భుట్టో జర్దారీ కాశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ పార్టీ కాశ్మీర్ ను వెనక్కు తీసుకువస్తుందన్నారు. ఈ మేరకు ముల్తాన్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బిల్వాల్, "కాశ్మీర్ను తిరిగి వెనక్కు తీసుకువస్తాను. ఏ ఒక్క అంగుళాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే, అది పాకిస్థాన్ లోనిది" అని భుట్టో కుటుంబ వారసుడు ఆవేశంగా అన్నాడు. 2018లో జరగనున్న ఎన్నికల్లో బిల్వాల్ పోటీ చేయనున్నాడు. అదే సమయంలో తన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ధీమాగా ఉన్నారు.