: వీడియో కాన్ఫెరెన్స్ లో మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లోని స్వయం సహాయక సంఘాలతో చంద్రబాబునాయుడు ఈరోజు వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో, చంద్రబాబు మంత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సమావేశం అసాంతం మంత్రులే మాట్లాడితే కుదరదని, అధికారులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. అన్నీ మంత్రులే మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. మంత్రుల వల్ల... అధికారులు తమ అభిప్రాయాలను చెప్పడానికి ముందుకు రావడం లేదన్నారు. చంద్రబాబు చెప్పినప్పటికీ ఒకరిద్దరు మంత్రలు 'లాస్ట్ టైమ్ సార్' అంటూ మళ్లీ మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు ఒప్పుకోలేదు. తాను ఈ విషయంలో చాలా క్లియర్ గా ఉన్నానని... అధికారులను మాట్లాడనివ్వాలని ఆదేశించారు. ఈ సమావేశం, కేబినెట్ భేటీ కాదని మంత్రులు తెలుసుకోవాలన్నారు.

  • Loading...

More Telugu News