: పింఛన్ల పంపిణీలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు


క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్ఫరెన్స్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పింఛన్ల అంశంపై సమీక్షిస్తున్నారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్రమాలు జరిగితే సంబంధిత మంత్రులు, అధికారుల నుంచి సొమ్ము వసూలు చేస్తామన్నారు. అర్హులైన పేదలకు పింఛన్లు అందాలని, ఇందుకోసం సమగ్ర జాబితా తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పింఛన్ లబ్దిదారుల మొబైల్ నంబర్లను సేకరించి, నెలనెలా పింఛన్ చేరగానే ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందేలా చేయాలని చెప్పారు. నేరుగా వచ్చి పింఛన్ తీసుకోలేని వారికి ఇంటికే వెళ్లి అందించాలన్నారు.

  • Loading...

More Telugu News