: ఆంధ్రప్రదేశ్ కు త్వరలో ఓ బ్రాండ్ అంబాసిడర్!
తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను ఆమధ్య కేసీఆర్ నియమించారు. ఇదే బాటలో, ఆంధ్రప్రదేశ్ కు కూడా ఓ బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలని చంద్రబాబు భావిస్తున్నారు. నవ్యాంధ్రకు అంతర్జాతీయంగా ప్రచారం కల్పించడానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉంటే మంచిదన్న అభిప్రాయనికి చంద్రబాబు వచ్చారు. దీనికోసం, పేరు ప్రతిష్ఠలతో పాటు నిబద్ధత ఉన్న వ్యక్తులను ఎంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ను నియమించాలా? లేక త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టబోయే ఏడు మిషన్లకు వేర్వేరు బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలా? అన్న విషయంపై ఆంధప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. గతంలో, గుజరాత్ పర్యాటక శాఖకు అమితాబ్ బచ్చన్... పాఠశాలల్లో పరిశుభ్రత ప్రోత్సాహానికి ఆమీర్ ఖాన్... కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు విద్యాబాలన్ లు బ్రాండ్ అంబాసిడర్లగా పనిచేశారు.