: జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ సహాయక చర్యలు నిలిపివేత
'ఆపరేషన్ మెగా రాహత్' పేరుతో జమ్మూకాశ్మీర్ లోని వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు చేపట్టిన సహాయక చర్యలను ఆర్మీ నిలిపివేసింది. కానీ, వరద ప్రాంతాల్లోని వారికి అందించే పనులు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు "ఆపరేషన్ మెగా రాహత్ పేరుతో రెండు వారాల నుంచి జరుగుతున్న పనులు నిలిపివేశాం. అదే సమయంలో సహాయక, వైద్య సహాయ పనులు కొనసాగుతాయి" అంటూ ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, 'ఆపరేషన్ సద్భావన' కింద కార్యకలాపాలు జరుగుతాయని, అందుకు ఉత్తర కమాండ్ మద్దతు ఇస్తుందని పేర్కొంది.