: 'ఆగడు' సినిమాను ఆస్కార్ కు పంపాలి: రాంగోపాల్ వర్మ సెటైర్లు


మహేశ్ బాబు హీరోగా విడుదలైన 'ఆగడు' చిత్రంపై రాంగోపాల్ వర్మ మరోసారి సెటైర్లు వేశాడు. పరోక్షంగా సినిమాపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. 'ఆగడు' సినిమాలోని డైలాగ్స్ ని, డైలాగ్ మాడ్యులేషన్ ని స్పెషల్ నామినేషన్ క్రింద ఆస్కార్ ఎంట్రీకి పంపాలని, ప్రపంచ సినిమా చరిత్రలో 'ఆగడు డైలాగ్స్, డైలాగ్ డెలివరీ ఎప్పటికీ నిలబడిపోతాయని ఆయన అపహాస్యం చేస్తూ ట్వీట్ చేశాడు. కోన వెంకట్ ఇంత అద్భుతమైన డైలాగ్స్ రాయగలడని తాను అనుకోలేదని, తాను వెళ్లేసరికి సినిమా టైటిల్స్ అయిపోయాయని, అసలు ఇంతకీ డైలాగ్స్ రాసింది కోన వెంకటేనా? అని ప్రశ్నించాడు (ఈ సినిమాకి కోన వెంకట్ పనిచేయలేదు. మరి దీనిని కూడా సెటైర్ అనే అనుకోవాలేమో!). తన కెరీర్ లో ఓ బెస్ట్ క్యారెక్టర్ ను 'ఆగడు' లో ప్రకాష్ రాజ్ 'మిస్' అయ్యాడని వర్మ మరో సెటైర్ వేశాడు.(ఈ సినిమాలో ముందుగా విలన్ పాత్రకు ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత దర్శకుడు శ్రీను వైట్లకు, ప్రకాష్ రాజ్ కు వచ్చిన గొడవల కారణంగా...ఆ పాత్రకు ఆయన్ను తప్పించి సోనూ సూద్ ను తీసుకున్నారు). ఆఖరుగా, మహేశ్ బాబు అద్భుతమైన నటుడని... దయచేసి మహేశ్ బాబు మంచి పాత్రలు ఎంచుకునే విధంగా అభిమానులు ఆయనపై ఒత్తిడి తేవాలని వర్మ ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News