: విజయవాడలో అక్రమ ఆయుధాల దందా... మాజీ సైనికుడి అరెస్టు
విజయవాడలో అక్రమ ఆయుధాల దందా నడుపుతున్న ఓ మాజీ సైనికుడుని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ఆ మాజీ సైనికుడు, వాటిని నగరంలోని పలువురికి విక్రయిస్తున్నాడు. దీనిపై నగర పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అతడి స్థావరాలపై దాడి చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అక్రమ ఆయుధాల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.