: రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోండి... అతన్ని ఆదర్శంగా తీసుకోండి:చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ బలం పుంజుకోవాలంటే టీడీపీ నేతలంతా 'ఫైర్ బ్రాండ్' రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు నాయుడు వారికి సూచించారు. రేవంత్ రెడ్డి... పనిచేస్తోన్నట్టుగా మిగతా వారందరూ పని చేస్తేనే పార్టీ మళ్లీ తెలంగాణలో బలపడగలదని చంద్రబాబు టీటీడీపీ నేతలతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడటంలో రేవంత్ రెడ్డి అందరి కన్నా ముందున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. రేవంత్, ఏ అవకాశం వచ్చినా... కేసీఆర్ అండ్ కో పై ధ్వజమెత్తుతూ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేస్తున్నారని ఆయన భావిస్తున్నారు. ఏదో 'తూతూ మంత్రం' విమర్శ చేసినట్టుగా కాకుండా, సరైన ఆధారాలతో హోం వర్క్ చేసి రేవంత్ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చంద్రబాబు పార్టీ నేతల దగ్గర అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, మెట్రోరైల్ వ్యవహారంలో రేవంత్ చాలా రీసెర్చ్ చేసి సరైన సాక్ష్యాలు చేతిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాడని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేసినా... ప్రజాక్షేత్రంలోను, శాసనసభలోను పోరాడి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాలని బాబు టీటీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని సమాచారం.