: పిల్లలు లెక్కలు నేర్చుకోలేకపోతున్నారు
పిల్లలు లెక్కలు నేర్చుకోలేకపోతున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో 'యంగ్ లైవ్స్ స్టడీ' పేరిట నిర్వహించిన అధ్యయనం ఎలిమెంటరీ విద్యపై ఆసక్తికర అంశం వెల్లడించింది. 2006లో పిల్లలకు పెట్టిన పరీక్షలో వచ్చిన మార్కులను, 2013 లో అదే వయస్సు పిల్లలకు పెట్టిన పరీక్షలో వచ్చిన మార్కులతో పోల్చారు. ఇందులో 2013 లో పరీక్ష రాసిన పిల్లలకు మార్కులు తక్కువ వచ్చాయి. 2006 లో రాసిన పరీక్షలో మూడింట రెండొంతుల మంది సరైన సమాధానాలు ఇవ్వగా, 2013 లో సగం మందే సరైన సమాధానాలు ఇచ్చారు. దీంతో పిల్లల్లో గణితం నేర్చుకునే సామర్థ్యం తగ్గుతోందని నిర్ణయించింది. ఇది బాలల భవిష్యత్ పై ఆందోళన కలిగిస్తోంది.