: ఇకపై 'తెలంగాణ' అధికారిక మాసపత్రిక?
గత కొంత కాలంగా మీడియాపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మాసపత్రిక వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీఆర్ఎస్ పార్టీకి సొంతంగా 'నమస్తే తెలంగాణ', 'టీ న్యూస్' మీడియా సంస్థలు ఉన్నాయి. అవి పార్టీవి అయినందున, వాటిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నందున ప్రభుత్వానికి మాస పత్రిక ఉండాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మాసపత్రికపై న్యూస్ పేపర్ రెజిస్ట్రార్ ని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించినట్టు సమాచారం. అక్టోబర్ 2 నుంచి 'తెలంగాణ' పేరుతో అధికారిక మాసపత్రిక వెలువడే అవకాశముంది.