: బీజేపీ నేతలపై రాజ్ నాథ్ సింగ్ కు ఫిర్యాదు


బీజేపీ నేతలపై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు జాతీయ మైనారిటీ కమిషన్ ఫిర్యాదు చేసింది. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ మైనారిటీ కమిషన్ ఫిర్యాదులో పేర్కొంది. కాగా, బీజేపీ ఎంపీ స్వామి ఆదిత్యానాథ్ మదర్సాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు శ్రుతి మించకముందే ప్రధాని ముస్లిం సోదరుల దేశభక్తిని కీర్తించారు. భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News