: సమైక్య వాదాన్ని గెలిపించిన మీకందరికీ కృతజ్ఞతలు: బ్రిటన్ ప్రధాని
స్వతంత్ర దేశం దిశగా జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికి పట్టం కట్టిన స్కాట్లాండ్ ప్రజలకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమెరూన్ ధన్యవాదాలు తెలిపారు. 300 ఏళ్ల సుదీర్ఘ బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధాన్ని నిలిపిన ప్రజలకు, సమైక్య వాదాన్ని ప్రచారం చేసిన వారికి పేరుపేరునా కృతజ్ఞతలని ఆయన పేర్కొన్నారు. సుమారు 43 లక్షల మంది జనాభా కలిగిన స్కాట్ లాండ్ లోని 32 రాష్ట్రాల్లో కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే విభజనకు అనుకూలంగా తీర్పునిచ్చాయి. సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం ప్రజలు ఓటు వేస్తే... వ్యతిరేకంగా 45 శాతం మంది ప్రజలు ఓటు వేశారు. దీంతో, స్కాటిష్ విభజన వాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవంబర్ నుంచి స్కాట్ లాండ్ వాసులకు ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా తమ సంక్షేమ పథకాలు సాగుతాయని బ్రిటన్ ప్రధాని తెలిపారు. నవంబర్ నుంచి తాము ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల ద్వారా స్కాట్ లాండ్ వాసులకు మరిన్ని అధికారాలు వశమవుతాయని ఆయన వెల్లడించారు.