: నా కుటుంబ ఆస్తులు ఇవే : బాబు
విలువల ఆధారంగా తన జీవితం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు తన ఆస్తుల వివరాలు ఎథిక్స్ కమిటీకి అందజేశారు. గత నాలుగేళ్లుగా తాను ఎథిక్స్ కమిటీకి ఆస్తుల వివరాలు అందజేస్తున్నానని అన్నారు. కుటుంబ జీవనానికి ఏదో ఒక ఆధారం ఉండాలనే ఉద్దేశ్యంతో హెరిటేజ్ సంస్థను స్థాపించానని బాబు తెలిపారు. హెరిటేజ్ లో 3 వేలకు పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారని ఆయన వెల్లడించారు. దీంతో గతేడాదితో పోలిస్తే ఆదాయం కొద్దిగా పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. తన భార్య పేరిట ఉన్న ప్రావిడెంట్ ఫండ్, బంగారం పెరిగాయని ఆయన తెలిపారు. నిర్వహణ హోల్డింగ్స్ ఆస్తులు 90 లక్షలు పెరిగాయని ఆయన వెల్లడించారు. లోకేష్ ఆస్తులు గతేడాదితో పోలిస్తే కోటీ 40 లక్షల రూపాయలు క్షీణించాయని ఆయన వివరించారు.