: నక్సలైట్లమంటూ బంగారం ఎత్తుకుపోయారు


నక్సలైట్లమని బెదిరించి దుండగులు బంగారం ఎత్తుకుపోయారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మార్వాడి వ్యాపారి ప్రకాశ్ జైన్ ఇంట్లో గత రాత్రి కిటికీలు తొలగించి నలుగురు దొంగలు దూరారు. నక్సలైట్లమని చెప్పి ప్రకాశ్ జైన్ దంపతులను బెదిరించి 30 కాసుల బంగారం, 300 గ్రాముల వెండి దోచుకున్నారు. దీంతో ప్రకాశ్ జైన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్లూస్ టీం వచ్చి తనిఖీలు చేపట్టారు.

  • Loading...

More Telugu News