: హైదరాబాద్ ను స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దుతాం: కేటీఆర్
హైదరాబాదును స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో జీహెచ్ఎంసీ, అస్కీ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ అంటే రోడ్లు, సౌకర్యాలు మెరుగుపరచడమే కాదని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దడమని అన్నారు. హైదరాబాదును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అందరూ కలసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే 39 శాతం పట్టణీకరణ జరిగిందని ఆయన తెలిపారు.