: తెలంగాణకు సరిపోయే వాస్తవిక ప్యాకేజీ ఇస్తాం: వైవీ రెడ్డి
తెలంగాణకు సరిపోయే, సాధ్యమయ్యే వాస్తవిక ప్యాకేజీ ఇస్తామని 14వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవీ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం తమకు సమర్పించిన ప్రతిపాదనలపై సోమవారం సమగ్రంగా చర్చిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలు అభినందించతగ్గవని ఆయన పేర్కొన్నారు. 14వ ఆర్థిక సంఘం తెలంగాణకు వీలైనంత మేలు చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. మనవూరు-మన ప్రణాళిక, వాటర్ గ్రిడ్, చెరువులు, హరితహారం, స్మార్ట్ సిటీ, విద్యుత్ సమస్యలపై సీఎం వివరించారని ఆయన తెలిపారు. తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు.