: జమ్మూ కాశ్మీర్ కు మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయం
జమ్మూ కాశ్మీర్ కు మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మేరకు రూ.4.25 కోట్ల అత్యవసర ఆర్థిక సాయాన్ని అందించేందుకు ముందుకువచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిసిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, పలువురు మంత్రులను కూడా కలిశారు. ఈ సమయంలోనే జమ్మూకు సాయం చేస్తామని ప్రకటన చేశారు. కాగా, ప్రపంచంలోని పేదరికాన్ని పారద్రోలాలన్న సదుద్దేశంతో బిల్ గేట్స్ తన భార్య మెలిండా పేరిట సంస్థను ఏర్పాటు చేసి ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ బాధితుల సహాయం కోసం కేంద్ర పర్యాటక శాఖ రూ.100 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తాన్ని అక్కడ దెబ్బతిన్న హోటల్స్ కు, మిగతా వాటికి ఉపయోగిస్తామని తెలిపింది.