: మోడీ ఎఫెక్ట్... చైనా సైన్యం జారుకుంటోంది
చైనాపై మోడీ ఎఫెక్ట్ పని చేసింది. చైనా సరిహద్దుల్లో కవ్వింపులతో భారత జవాన్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చైనా సైన్యం నెమ్మదిగా జారుకుంటోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ వచ్చిన సందర్భంగా, ప్రధాని మోడీ సరిహద్దుల్లో జరుగుతున్న చొరబాట్లపై తీవ్రంగా స్పందించారు. 15 ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయడం గొప్ప కాదని, పరస్పరం నమ్మకం కలిగేలా వ్యవహరించడం ముఖ్యమని సూచించిన నేపథ్యంలో చైనా సైన్యం వెనక్కి తరలిపోతోంది. ఈ పరిణామం పట్ల విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి అలాంటి చొరబాట్లు జరుగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలను హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం శుభసూచకమని, సరిహద్దు సమస్యపై వివరంగా మాట్లాడుకుని చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని వారు సూచిస్తున్నారు.