: ఆస్తి కోసం కన్న కూతుర్ని నరికేసింది


డబ్బు మా చెడ్డదని, ఆస్తుల కోసం అర్రులు చాచడం తగదని ఆధ్యాత్మికవేత్తలు హితోపదేశాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ, ఆస్తుల కోసం అయినవాళ్లను కాదనుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. ఆస్తికోసం సొంతబిడ్డనే నరికేసుకుందో తల్లి. హైదరాబాదులోని యూసుఫ్ గూడ లక్ష్మీనగర్ లో కళ్యాణి (25) అనే మహిళను ఆమె తల్లి లక్ష్మి (50) నరికి చంపింది. రక్తమోడుతున్న కుమార్తె శవం పక్కనే కత్తిపట్టుకుని నిల్చుంది. లక్ష్మికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురూ స్థానికంగానే ఉంటారు. వీరి మధ్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. వీరి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమేరాలను ధ్వంసం చేసిన తరువాతే కళ్యాణి హత్య జరగడం గమనార్హం. దీంతో, కళ్యాణిని మిగిలిన ఇద్దరు కుమార్తెలతో కలిసి లక్ష్మి చంపేసి ఉంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News