: మాసాయిపేట క్షతగాత్ర చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం
మెదక్ జిల్లా మాసాయిపేటలో బస్సును రైలు ఢీకొన్న ప్రమాద ఘటనలో గాయపడ్డ చిన్నారుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఈ రోజు అందించారు. జులై నెల చివర్లో జరిగిన ఈ దారుణ ఘటనలో 17 మంది విద్యార్థులు మరణించారు. పలువురు గాయపడ్డారు.