: భారతీయ ముస్లింలు... దేశం కోసం అవసరమైతే ప్రాణాలర్పిస్తారు: ప్రధాని మోడీ


కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత పలు హిందూ గ్రూపులు, ముస్లింలపై పరుష పదజాలంతో విరుచుకుపడటం మొదలు పెట్టాయి. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం భారతీయ ముస్లింల ఉదాత్తమైన మనోభావాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ‘‘భారతీయ ముస్లింలు... దేశం కోసమే జీవిస్తారు. అవసరమైతే దేశం కోసం ప్రాణాలర్పించేందుకూ వెనుకాడరు. భారత్ కు ఎలాంటి నష్టం కలగకూడదని ప్రగాఢంగా విశ్వసిస్తారు’’ అంటూ ఓ అమెరికా టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శుక్రవారం ఆయన వెల్లడించారు. ‘‘అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ భారతీయ ముస్లింల గురించి తప్పుగా అర్థం చేసుకుంటోంది. తమ ట్యూన్లకు అనుగుణంగా భారతీయ ముస్లింలు స్టెప్పులేస్తారని అనుకుంటోంది’’ అని కూడా మోడీ వ్యాఖ్యానించారు. ఇస్లాం పేరిట జరుగుతున్న విశ్వవ్యాప్త పోరులో పాలుపంచుకోవాలని భారతీయ ముస్లింలకు పిలుపునిస్తూ, ఇటీవల అల్ ఖైదా చీఫ్ అయిమాన్ అల్ జవహరి విడుదల చేసిన వీడియోపై మోడీ ఈ మేరకు ఘాటుగా స్పందించారు. తద్వారా భారతీయ ముస్లింల గొప్పదనాన్ని, దేశభక్తిని ప్రపంచానికి తెలియజేశారు.

  • Loading...

More Telugu News