: గేట్స్ భాగస్వామ్యంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతాం: వెంకయ్య నాయుడు
మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ తో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడి సమావేశం ముగిసింది. కేవలం అర్థగంట పాటు జరిగిన ఈ భేటీలో దేశంలోని పారిశుద్ధ్య ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం, వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా గేట్స్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఆయన భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ విషయంలో కొత్త పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్న మంత్రి... దేశవ్యాప్తంగా దీనిపై అవగాహన పెంచేందుకు దృష్టి పెట్టాలన్నారు. గేట్స్ మాట్లాడుతూ, పారిశుద్ధ్యంపై, ఆధునిక సాంకేతిక అంశాలపై చర్చించామని చెప్పారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో చేతులు కలుపుతున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.