: చెన్నై పర్యటనలో ఏపీ మంత్రులు, అధికారుల బృందం
ఆంధ్రప్రదేశ్ లో 'అన్న క్యాంటీన్ల' ఏర్పాటు నేపథ్యంలో మంత్రులు, అధికారుల బృందం చెన్నైలో పర్యటిస్తున్నారు. అక్కడి 'అమ్మ' క్యాంటీన్లను పరిశీలించి క్యాంటీన్ల నిర్వహణకు అవసరమైన స్థలం, ఆర్థిక, ఆహార పదార్థాల సేకరణపై వివరాలను సేకరిస్తున్నారు. మంత్రులు పరిటాల సునీత, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు... వారితో పాటు అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు ఉన్నారు.