: కోహ్లీకి సచిన్ సాయం


ఫామ్ లో లేక, పరుగులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సలహాలిస్తున్నాడు. సాయం చేయాలంటూ సచిన్ ను కోరిన కోహ్లీ ఈ మేరకు ముంబయి వచ్చాడు. ముంబయి క్రికెట్ సంఘం ఇండోర్ నెట్స్ లో సచిన్ సమక్షంలో కోహ్లీ ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్ పలు విలువైన సూచనలు చేశాడు. ఆఫ్ స్టంప్ పై పడే బంతులను ఎదుర్కోవడంపై విరాట్ దృష్టి పెట్టాడట. ఈ వివరాలను మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్ పుత్ మీడియాకు తెలిపారు.

  • Loading...

More Telugu News