: కాలేయ సమస్యల కారణంగానే మాండలిన్ శ్రీనివాస్ మరణం
మాండలిన్ జీనియస్ ఉప్పాలపు శ్రీనివాస్ కాలేయ సమస్యల కారణంగానే మరణించినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతోన్న శ్రీనివాస్ కు ఈ ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ ఫెయిల్ అవడంతో మాండలిన్ శ్రీనివాస్ ఆకస్మికంగా మృతి చెందారు. మాండలిన్ శ్రీనివాస్ మరణంతో చెన్నైలోని కళారంగం మూగబోయింది.