: చంద్రబాబు పరీక్షలో టాప్-10 ర్యాంకులు పొందిన మంత్రుల వివరాలివిగో... నంబర్ వన్ దేవినేని ఉమ!


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సర్కారు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని... తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఓ సీక్రెట్ సర్వేను చేయించారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఈ సర్వేను నిర్వహించింది. మంత్రుల పనితీరును సమగ్రంగా అంచనా వేసేందుకు ఈ సర్వేను అత్యంత పకడ్బందీగా, రహస్యంగా నిర్వహించారు. నియోజకవర్గాల్లో మంత్రుల పనితీరు, వారి ఇమేజ్ ... ప్రభుత్వ పథకాలను వారు ఎంతమేరకు ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతున్నారు... ప్రజలతో సంబంధాలు... ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ఎంతమేరకు కృషి చేస్తున్నారు... సంబంధిత శాఖపై పట్టు తదితర విషయాలను ఈ సర్వే ద్వారా అంచనా వేసి ర్యాంకింగ్ ఇచ్చారు. సర్వే ఫలితాల ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన కేబినెట్ సహచరులకు నిన్న ర్యాంకింగ్ ఇచ్చారు... అందరినీ ఆశ్చర్యపరుస్తూ, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ చంద్రబాబు 'పరీక్ష'లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దేవినేని ఉమకు టాప్ ర్యాంక్ వస్తుందని తాము ఏమాత్రం ఊహించలేదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఇక, రెండో స్థానాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దక్కించుకున్నారు. కామినేని శ్రీనివాస్ కు రెండో ర్యాంకు రావడం పట్ల ఎవరికీ పెద్ద ఆశ్చర్యం కలగలేదని... ఆయన పనితీరుపై ముందునుంచీ అందరికీ పాజిటివ్ ఒపీనియన్ ఉందని టీడీపీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మూడో స్థానాన్ని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, నాలుగోస్థానాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సాధించారు. చంద్రబాబు సర్వేలో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన మంత్రుల వివరాలు మొదటి స్థానంలో... భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ రెండో స్థానంలో... వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మూడో స్థానంలో... కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నాలుగో స్థానంలో... వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఐదో స్థానంలో... అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, ఆరో స్థానంలో... పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఏడో స్థానంలో... రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, ఎనిమిదో స్థానంలో... ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తొమ్మిదో స్థానంలో... సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, పదో స్థానంలో... పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ ఉన్నారు. ఇక ఆశ్చర్యకరంగా, చంద్రబాబు కేబినెట్ లో కీలక మంత్రైన యనమల రామకృష్ణుడు... డిప్యూటీ సీఎంలైన కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పలకు టాప్-10 లో చోటు దక్కకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News