: పేదలను ఆకట్టుకోవడానికి టీడీపీ సర్కార్ 'ఫెస్టివల్ థమాకా'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకోవడానికి కొత్తకొత్త పథకాలకు రూపకల్పన చేస్తోంది. తాజాగా... నిరుపేదలను ఆకర్షించడానికి మరో 'కొత్త ఐడియా'కు తుది మెరుగులు దిద్దుతోంది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ఈ పథకానికి సంబంధించిన 'హింట్'ను ఇచ్చారు. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పెద్ద పండగల నాడు పేదలకు ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పండగ ముందు రోజు పేదలకు కొత్త దుస్తులు, నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేసేలా ఓ 'ఫెస్టివల్ థమాక్ ఆఫర్'ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.