: పులిచింతల నీటి నిల్వ తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తెలంగాణ, ఏపీ సీఎస్ ల భేటీ ముగిసింది. పులిచింతల పునరావాసం పూర్తి కాకపోవడంతో... ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న నల్గొండ జిల్లా గ్రామాల్లో నీరు చేరింది. వీరి పునరావాసానికి 20 కోట్లు ఇచ్చేందుకు ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అలాగే, పులిచింతల నీటి నిల్వ 11 టీఎంసీల నుంచి 7.5 టీఎంసీలకు తగ్గించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది.