: మెట్రో ప్రాజెక్టు కలకలంపై వెంకయ్య నాయుడి స్పందన
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుపై తాజాగా రేగిన కలకలంపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆచితూచి మాట్లాడారు. ఇంతవరకు వచ్చాక మెట్రో ప్రాజెక్టు వెనక్కు వెళ్ళడం సమంజసం కాదన్నారు. అధికారులు, నిర్మాణ సంస్థ, ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. మెట్రో రైలు ప్రాజెక్టుపై పత్రికా కథనాలపై తాను మాట్లాడనన్నారు.